![]() |
![]() |
.webp)
దీప్తి సునైనా సోషల్ మీడియాలో క్యూట్ గా కనిపిస్తూ ఆడియన్స్ ని, ఫాన్స్ ని తన ఫన్నీ కామెంట్స్ తో అలరిస్తూ ఉంటుంది. అలాంటి సునయన రీసెంట్ గా "ఆస్క్ మీ" అని అడిగేసరికి ఇంకా ఊరుకుంటారా నెటిజన్స్ వెంటనే "నీ వెయిట్ ఎంత దీపు" అని అడిగేసారు ఒక నెటిజన్..దీపు ఊరుకుంటుందా "60 కేజీలు" అంటూ తన ముక్కును ముప్పయ్యారు వంకర్లు తిప్పుతూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. "శివ జ్యోతి ఆర్ గంగూలీ..ఎవరిష్టం" అనేసరికి "ఎప్పుడైనా అండ్ పెట్టాలి ఆర్ పెట్టొద్దు" అని ఘాటుగా స్వీటుగా వార్నింగ్ ఇచ్చింది. "రెండు అకౌంట్స్ ఉన్నాయా" అనేసరికి " ఒకటి కాదు రెండు కాదు ఐదు అకౌంట్స్ ఉన్నాయి...ఒకటి బ్లాక్ చేస్తే ఇంకో అకౌంట్ తో వస్తా" అని చెప్పింది.
"ఫేవరేట్ కర్రీ ఏమిటి" "నాకు చిక్కుడుకాయ అంటే ఇష్టం అని ఎక్స్ప్లనేషన్ ఇవ్వబోయింది. కానీ కంటిన్యూ చేయకుండా ఆపేసింది" "నువ్వు చేసిన సాంగ్స్ లో ఏదంటే ఇష్టం" అని అడిగేసరికి "అన్ని సాంగ్స్ ఇష్టం" అని చెప్పింది. "లంచ్ కి ఎం ప్రిపేర్ చేసావ్ దీపు" అనేసరికి "ఉకూసుకి వెళ్లి తిందామని ప్లాన్ చేస్తున్నా" అని ఆన్సర్ ఇచ్చింది. ఇక ఫైనల్ గా నవ్య మారోతుతో కలిసి "కొంత కాలం కిందట" అంటూ "నీ స్నేహం, శివ" మూవీస్ లోని సాంగ్స్ తో ఎంజాయ్ చేస్తూ కార్ లో ట్రావెల్ చేస్తూ వీడియోస్ తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది దీప్తి. దీప్తి సునైనా యూట్యూబర్ గా , బిగ్‌బాస్ బ్యూటీగా సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఐతే బిగ్ బాస్ హౌస్ వెళ్లి వచ్చిన హౌస్ మేట్స్ చాలామందికి కూడా మూవీస్ లో, వెబ్ సిరీస్ లో మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అలా వాళ్ళు సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటారు. కానీ దీప్తికి మాత్రం ఇంకా అలాంటి ఛాన్సెస్ వచ్చినట్టు ఏమీ కనిపించడం లేదు. ప్రస్తుతానికి కవర్ సాంగ్స్ తో, ఫోటో షూట్స్ తో అలరిస్తోంది.
![]() |
![]() |